సుభాష్‌నగర్: ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నా రు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగం, సహనం కలిస్తే మహిళ అని కొనియాడారు. అనంతరం మహిళా మేనేజర్లు, సిబ్బందితో కలిసి కేక్ కట్‌చేసి, సీనియర్ మహిళా మేనేజర్లను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకురాలు రాధ, నిజామాబాద్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణం, సందీప్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment