చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధి
వేల్పూర్: చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధికి గురైన ఓ బాలుడు, ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. వైద్య చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు పేర్కొనడంతో తల్లి దండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూ స్తున్నారు. మండలంలోని పచ్చలనడ్కుడ గ్రా మంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీన్‌రెడ్డి, మనోజ దంపతులకు కుమారుడు నిఖిలేష్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆరో తరగతి చదువుతుండగా ఇటీవల అనారోగ్యానికి గురికాగా వైద్యపరీక్షలు చేయించారు. అందులో అతడికి అరుదైన బ్లడ్ క్యాన్సర్ సోకినట్లు వైద్యు లు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నా రు. ఇప్పటిదాకా రూ. 14 లక్షలు చికిత్సకు ఖర్చు చే శారు. నిఖిలేష్ పూర్తి కోలు కోవాలంటే చికిత్సకు రూ. 60లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతఖర్చు భరించే స్థోమత తమకు లేదని, దాతలు తోచినంత సహాయం అందించాలని వేడుకుంటున్నారు. 9494719197 నంబరుకు ఫోన్‌పే చేసి, కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పచ్చలనడ్కుడకు చెందిన నిఖిలేష్
చికిత్సకు రూ.60లక్షలు
ఖర్చవుతుందంటున్న వైద్యులు
దాతలు ఆదుకోవాలంటూ
బాలుడి తల్లిదండ్రుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment