చేపలను గ్రామంలోనే విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని వాజిద్‌నగర్ గ్రామ చెరువులో గంగపుత్రులు పట్టిన చేపలను గ్రామంలోనే విక్రయించాలని గ్రామస్తులు కోరారు. ఇతర ప్రాంతాలకు తరలించొద్దని చేపల వాహనా న్ని శనివారం స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం వాహనాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దనే నిలిపిఉంచారు. స్థానికంగా చేపలు అమ్ముడుపోవడం లేదని, అందుకే హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తామని గంగపుత్రులు పేర్కొంటున్నారు. సుమారు రూ.6 లక్షల విలువ ఉన్న చేపల వాహనాన్ని రెండు రోజుల నుంచి జీపీ వద్ద పెట్టారని వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకు న్న కొందరి వ్యక్తులపై పొలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. గ్రామంలో కొన్ని చేపలు విక్రయించాలని గంగపుత్రులకు సూచించిన ఒక్క చేప కూడా విక్రయించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఇతర ప్రాంతాలకు తరలించొద్దు
వాజిద్‌నగర్‌వాసుల డిమాండ్
చేపల వాహనం అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment