బాల్కొండ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్.. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ఈ నెల 27 నుంచి గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేశ్‌గౌడ్, ముత్యంరెడ్డి, కొత్తింటి ముత్యంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.