పిట్లం/నిజాంసాగర్/బిచ్కుంద : సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో గిరిజనులు నడవాలని ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పిట్లంలోని సాయిగార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం మండల బంజార నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మ హరాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ మ్మెల్యే హాజరయ్యారు. భోగ్ బండార్‌లో పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ ని ర్మిస్తామన్నారు. జుక్కల్ మండలం బంగారుపల్లి, దోస్త్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. దోస్త్‌పల్లి గ్రామం నుంచి జుక్కల్ మండల కేంద్రం వరకు బీటీ రోడ్డు పనులను నాణ్య తగా చేపట్టాలని కాంట్రాక్టర్, ఆర్‌ఆండ్‌బీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బిచ్కుంద క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. షాదీఖానాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో బంజా రా, కాంగ్రెస్ నాయకులు రమేష్‌దేశాయ్, సాయాగౌడ్, మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్‌రెడ్డి, నాగ్‌నాథ్, గంగాధర్, నాగ్‌నాథ్ పటేల్, సాహిల్, గౌస్, పాషా,అజీం, ఖలీల్, నౌషా నాయక్, తుకారం పాల్గొన్నారు.