ధర్పల్లి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తహసీల్దార్ మాలతి అన్నారు. మండల కేంద్రంలో ధర్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మల్లికార్జున్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ బాలరాజ్, చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
సిరికొండ: రైతులు సొసైటీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సిరికొండ పీఏసీఎస్ చైర్మన్ చెల్లం గంగాధర్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో మహాజన సభను బుధవారం నిర్వహించారు. సభలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతులకు సొసైటీ ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నందున ధాన్యాన్ని సొసైటీ కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల నుంచి ఆడిట్‌లో తేలిన డబ్బులను త్వరగా రికవరీ చేయాలన్నారు. వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, డైరెక్టర్లు సంతోష్‌రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీలత, గంగవ్వ, లింగం, గోవింద్, రమేశ్, సీఈవో గిరిధర్ పాల్గొన్నారు.