మోపాల్: మండలంలోని కంజర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రూ.50వేల విలువైన 5 బీరువాలను గురువారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయరావు మాట్లాడుతూ.. పాఠశాలలో లైబ్రరీ పుస్తకాలు, ల్యాబ్ పరికరాలు, ముఖ్య మైన పాఠశాల పుస్తకాలు భద్రపర్చేందుకు బీరువాలు అందజేశామని తెలిపారు. అనంతరం పాఠ శాలలో ఆరోగ్య, దంతాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దంత వైద్యనిపుణుడు రొటేరియన్ కొండ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్వీయ సంరక్షణే పరిపూర్ణ ఆరోగ్య రక్షణ అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు టూత్ పేస్టులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గంగారెడ్డి, ప్రతినిధు లు బీరెల్లి నర్సింగ్‌రావు, గుర్పిత్ సింగ్, తులసీదాస్ పటేల్, బాబూరావు, పాఠశాల హెచ్‌ఎం గోపాల్‌చారి, సమన్వయకర్త గోపాలకృష్ణ, ఉమా గౌరి, వెంకటలక్ష్మి, రాణి, కాంతి కిరణ్, విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.