
శ్రీరామా.. ఇవేం లెక్కలు!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్‌కు కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలపై అధికారులు చెబుతున్న లెక్కలు గజిబిజిగా ఉంటున్నాయి. కాలువల్లో నీటి ప్రవాహం ఒకే లా ఉన్నప్పటికీ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గింపు లెక్క లు తేడా కొడుతున్నాయి. కాలువలు, లిప్టులు, తా గు నీటి కోసం మొత్తం ప్రాజెక్టు నుంచి 8372 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అయితే, ప్రాజెక్టులో నీటిమట్టం మాత్రం ఒక రోజు 0.5 టీఎంసీలు, మరో రోజు 0.24 తగ్గినట్లు చూపుతున్నారు. నాలుగు రోజుల నుంచి ప్రాజెక్ట్ నుంచి 33 వేల క్యూసెక్కుల నీరు విడుదల అయినా, ఒక్క టీఎంసీ కూడా తగ్గినట్లు రికార్డుల్లో చూపకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చివరి లెక్కలు సరి చేసేందుకే అధికారులు ఇలా చేస్తుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఈఈ చక్రపాణిని ‘సాక్షి’ వివరణ కోరగా వివరాలు తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు.
కాకతీయ కాలువ నీటి ప్రవహంపై..
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల, నీటి ప్రవాహంపై ఆది నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ కాలువ పూర్తి సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు, ఆ ప్రవాహ సూచిక కోసం కాలువ వద్ద సూచిక బోర్డులో 15 పాయింట్లు వేశారు. ప్ర స్తుతం ఆ బోర్డులో 13 పాయింట్ల వరకు నీటి విడుదల జరుగుతోంది. అయినా కాకతీయ కాలువ ద్వా రా 5,500 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోందంటూ ప్రాజెక్ట్ అధికారులు లెక్కల్లో చూపుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా విడుదలయ్యే నీటిని విద్యుదుత్పత్తి కోసం జెన్‌కో గేట్ల గుండా సరఫరా చేస్తారు. లెక్కల్లో వ్యత్యాసం ఏమిటని అడిగితే జెన్‌కో అధికారులే ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నారంటూ సెలవివ్వడం గమనార్హం.
నీటి విడుదల.. నిల్వ క్యూసెక్కుల్లో..
ఎస్సారెస్పీ నీటి విడుదల,
నిలువల్లో వ్యత్యాసం
చివరి లెక్కలు సరిచేసేందుకేనంటూ
ఆరోపణలు

శ్రీరామా.. ఇవేం లెక్కలు!