
జిల్లా నాయకులతో కేసీఆర్ సమావేశం
నిజామాబాద్ అర్బన్: బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం ఎర్రవల్లిలో జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మహాసభకు నాయకులు, కార్యకర్తల తరలింపుతోపాటు ఇతర అంశాలపై వారితో చర్చించి సలహాలు, సూచనలు చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు రజతోత్సవ మహాసభను విజయవంతం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా , ఆయేషా తదితరులు పాల్గొన్నారు.