
ఇసుకాసురులదే రాజ్యం
● బోధన్ డివిజన్‌లో పరిమితికి మించి
టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా
● ఒక్క కూపన్‌తో రెండు నుంచి మూడు ట్రిప్పులు
● రవాణా శాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తేనే అడ్డుకట్ట
● తమ పరిస్థితి అగమ్యగోచరమైందంటున్న నిజామాబాద్
లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
● హైదరాబాద్‌లో గనులశాఖ ప్రిన్సిపల్
సెక్రెటరీకి ఫిర్యాదు
● నిజామాబాద్ రూరల్ మండలంలో
పట్టుబడ్డ మూడు టిప్పర్లు
● తాజాగా గురువారం అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను నిజామాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అయి తే వీటిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ లారీలపై కేసులు కాకుండా, కేవలం మైనింగ్ అధికా రుల ద్వారా జరిమానా వేయించి పంపించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు లాబీయింగ్ చేసినట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ డివిజన్‌లోని మంజీర పరీవాహకంలో ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో కొందరు అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ ఇసు క రవాణాదారుల ఇష్టారాజ్యం అయింది. ఏకంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసుకుని జీరో దందా చే స్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లింపులు చేసి కాళేశ్వరం నుంచి ఇసుక రవాణా చేస్తున్న తమ కు అన్యాయం జరుగుతోందని నిజామాబాద్ లారీ ఓనర్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు.
● బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో స్థానిక ప్రజల అవసరాలు, వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఖండ్‌గావ్, సిద్ధాపూర్, మందర్నా గ్రామాల వద్ద మంజీర నదిలో ఇసుక తవ్వేందుకు రెవెన్యూ శాఖ ద్వారా అనుమతులిచ్చింది. అయితే ఇసుక తోలకందార్లు ఒక్క కూపన్ మీద రెండు నుంచి మూడు ట్రిప్పులు కొడుతున్నారు. పైగా సమీప ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుని జీరో దందా చేస్తున్నారు. రెంజల్ మండలంలోని నీల, పేపర్‌మిల్లు గ్రామాల వద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుక తోడేసి, రవాణా చేస్తున్నారు. అదేవిధంగా పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో ఇసుక తరలిస్తున్నారు. తహసీల్దారు ఇచ్చిన అనుమతి మేరకు ఇక్కడ నుంచి ఒక్కో టిప్పర్‌కు 10.5 టన్నులు (7 క్యూబిక్ మీటర్లు) లోడ్ వేయాల్సి ఉంటుంది. అయితే ఏకంగా 21 టన్నులు (14 క్యూబిక్ మీటర్లు)తో టిప్పర్లు వెళుతున్నాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ల బాడీని ఎత్తుకు కట్టిస్తున్నారు. రవాణా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ టిప్పర్ల ద్వారా ఇసుకను నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్న చోటనే రవాణా శాఖ చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఓవర్ లోడ్ వ్యవహారాన్ని అరికట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో మాట్లాడుతున్న
నిజామాబాద్ లారీ అసోసియేషన్ ప్రతినిధులు
నిజామాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్న టిప్పర్లు
ఇసుక అక్రమ దందా చేస్తున్న టిప్పర్ల కారణంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ నిజామాబాద్ లారీ ఓనర్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్‌ఆర్ రవి, లింగారెడ్డి, నగేశ్,నర్సింహ, మజర్, పటేల్, ఇమ్రాన్, ముఫ్తి గురువారం హైదరాబాద్ వెళ్లి గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ.13,200 డీడీ కట్టి కాళేశ్వరం నుంచి ఇసుక రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 14 టైర్ల లారీలో వాహన బరువుతో కలిపి 42 టన్నుల ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఉంది. నిజామాబాద్ నుంచి కాళేశ్వరం వెళ్లి వచ్చేందుకు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసేందుకు నాలుగు రోజుల సమయం పడుతోందని తెలిపారు. అయితే అక్రమార్కులు జిల్లా కలెక్టర్‌కు కేవలం రూ.2,500 డీడీ మాత్రమే చెల్లించి బోధన్ ప్రాంతం నుంచి ఆరు టైర్ల టిప్పర్ల ద్వారా అధిక లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. తాము 14 టైర్ల లారీకి 32 టన్నులకు డీడీ కట్టగా 28 టన్నుల ఇసుక మాత్రమే వస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ అక్రమార్కులు స్థానికంగా మంజీర నుంచి ఆరు టైర్ల టిప్పర్‌లో 10.5 టన్నులకు డీడీ కట్టి ఏకంగా 21 టన్నుల నుంచి 25 టన్నులు రవాణా చేస్తున్నట్లు వివరించారు. స్థానికంగా ఇసుక రవాణా చేసేందుకు ట్రాక్టర్లకు తప్ప టిప్పర్లకు అనుమతి లేదని, అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో టిప్పర్లతో ఇసుక రవాణా చేసేందుకు విచ్చలవిడి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ టిప్పర్ల కారణంగా ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా డీడీ కట్టి 14 టైర్లు, 16 టైర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న తాము నష్టపోతున్నట్లు వివరించారు. నిజామాబాద్ కలెక్టర్, రవాణాశాఖ డీటీసీ, గనులశాఖ ఏడీ, పోలీసు కమిషనర్‌కు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇచ్చిన ఫిర్యాదులో అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇసుకాసురులదే రాజ్యం

ఇసుకాసురులదే రాజ్యం