
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అ నుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు, తాగునీ టి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎ స్ చౌహాన్‌తో కలిసి సంబంధిత శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క శనివారం వీడియో కా న్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్ హనుమంతు వివరించారు. యాసంగిలో జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటికే 3.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు. ఇందులో ఎక్కువ మొత్తం సన్న ధాన్యం ఉండగా, దొడ్డు రకం ధాన్యం కేవలం 12 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొను గోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. డిఫాల్ట్ లేని రైస్ మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయిస్తూ, మిల్లుల వద్ద దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకున్నామ న్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమా ర్, డీఆర్డీవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతు వెల్లడి
కొనుగోళ్లపై వీసీ ద్వారా సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, సీతక్క