
కార్యకర్తలకు అండగా ఉంటా
మోపాల్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అండగా ఉంటామని పార్టీ నియోజకవర్గ నాయకులు బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగర శివారులోని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ , కాంగ్రెస్ నాయకులు జగన్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కార్యకర్తలను బీఆర్‌ఎస్ కాపాడుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లు గెలుపొంతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రూప్‌సింగ్ బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.