
విజేతలకు సీపీ సన్మానం
నిజామాబాద్ అర్బన్: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నగర అగ్నిమాపక శాఖ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఆయా విభాగాలలో విజేతలుగా ని లిచారు. వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన లక్ష్మీమేఘన(9వ తరగతి), డ్రాయింగ్ పోటీలలో వైభవి(7వతరగతి) విజేతలుగా నిలిచారు. ఆదివారం పోలీసు కమిషనర్ సాయిచైతన్య.. మెమోంటోలతో విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కో–కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.