
సాధారణ ముస్లింల కోసమే వక్ఫ్ చట్ట సవరణ
సుభాష్‌నగర్: దేశంలోని సాధారణ ముస్లింల ప్ర యోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు చట్టాన్ని సవరించిందని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యా లయంలో సోమవారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు దేశంలోనే మూడో అతిపెద్ద భూమి కలి గిన సంస్థ అని, 2006లో 6లక్షల ఎకరాలు ఉండ గా, 2025 నాటికి 38లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం మా త్రం కేవలం రూ.9.90లక్షలు మాత్రమేనని అ న్నా రు. చట్టంలోని లొసుగులను అవకాశంగా మ ల్చుకుని ఓవైసీ సహా కాంగ్రెస్ ముస్లిం నేతలు వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు. 1995లో పీవీ నర్సింహారావు వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కట్టబెట్టగా, 2013లో సోనియా గాంధీ వక్ఫ్ ట్రిబ్యునల్‌కు అవకాశమిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలను వక్ఫ్ ట్రి బ్యునల్‌కు కల్పించారని ఆరోపించారు. వక్ఫ్ కింద ధరణి, భూభారతి వంటి సైట్లు ఏమీ పని చేయవని, వక్ఫ్‌తో ఇతర మతాలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. వక్ఫ్‌బోర్డు దుర్వినియోగమైందని, దేశానికి ప్రమాదకరంగా మారిన చట్టాన్ని కేంద్రం సవరించిందన్నారు. ప్రభుత్వ భూములు వక్ఫ్ భూమి గా ఎలా మారుతుందని, వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పు ఎలా ఫైనల్ అవుతుందని ప్రశ్నించారు. ట్రి బ్యునల్‌లో అందరూ సున్నీ ముస్లిములే ఉంటారని, అ లాంటప్పుడు ఇతర మతాలు, ప్రజలు, సంస్థలు, రైతులకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం చేసిన చట్ట సవరణ ద్వారా ప్రజలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వక్ఫ్ ఆదాయం కూడా పెంచేలా చట్టం చేశామని తెలిపారు. బీజేపీ ప్రజా శ్రేయస్సు కోసం నడిచే పార్టీ అని పేర్కొన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, నాయుడి రాజన్న, నాగరాజు, పంచరెడ్డి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
బోర్డు దేశానికే ప్రమాదకరంగా మారింది
ఓవైసీ సహా కాంగ్రెస్ ముస్లిం నేతలు
వక్ఫ్ ఆస్తులను దోచుకున్నారు
ఎంపీ అర్వింద్ ధర్మపురి