
రైతు ప్రయోజనాలే పరమావధి
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలే పరమావధి అని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం పని చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో తుమ్మలో మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని, సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేలా మెళకువలు అందించేందుకు రైతుమహోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో సాగు చేసే పంటలు, ఆధునిక సాగుపై మూడురోజులపాటు శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్‌లో జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేషన్ చైర్మన్‌లు ఈరవత్రి అనిల్, అన్వేష్‌రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, మా నాల మోహన్‌రెడ్డి, కాసుల బాల్‌రాజ్, జంగా రాఘవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నగేశ్‌రెడ్డి, బాడ్సి శేఖర్‌గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, సీపీ సాయిచైతన్య, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ఎన్ గోపి, ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్‌శాఖ జేడీ మల్లేశం, డీడీ పద్మహర్ష, అనుబంధశాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఐదు జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లాలో కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతోపాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేయిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీతకు ఈనెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామని అన్నారు.
రైతు మహోత్సవం ప్రారంభ సభావేదికపైనే జిల్లా ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రసంగిస్తూ గన్నీ బ్యాగుల కొరత ఉందని మంత్రుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గన్నీ బ్యాగుల కొరత ఉందని చెబుతున్నారని అన్నారు. భూపతిరెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రాకేశ్‌రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరువురు మంత్రులు రాకేశ్‌రెడ్డిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
వేదికపై వాగ్వాదం
సాగుకు ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానాన్ని జోడించాలి
ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపాలి
రైతులకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వర్‌రావు
అట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు
ఐదు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు

రైతు ప్రయోజనాలే పరమావధి

రైతు ప్రయోజనాలే పరమావధి

రైతు ప్రయోజనాలే పరమావధి