
అగ్రి, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొస్తాం
నిజామాబాద్ సిటీ: జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలను తీసుకొస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నందిపేట సెజ్‌ను పునరుద్ధరిస్తామని, సుదర్శన్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. అలాగే నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణ చేపట్టా రని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మినీ స్టేడియం, సింథటిక్ ట్రాక్ నిర్మిస్తామని, ఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌సీఎస్‌ఎఫ్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కుల సర్వేచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చట్టం చేశామని అన్నారు. తెలంగాణలో అ మలవుతున్న సంక్షేమ పథకాలు, హామీలపై దేశమంతా చర్చ జరుగుతోందని, రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు. రైతు భరోసా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, గ్యాస్ సిలిండర్‌కు రూ.500 రాయితోతోపాటు రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీతో ప్రజలు సంతోషంగా ఉ న్నారన్నారు. పేదల కళ్లలో ఆనందం కోసమే ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఏనా డూ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. రైతులు వరి కుప్పలమీదే ప్రాణాలు వదిలిన ఘటనలను చూశామన్నారు. రైతులపై లాఠీచార్జి చేసి, వారి చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. తమ హయాంలో ఏం చేశారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. జిల్లాకు ప్రత్యేకించి వారు చేసిందేమైనా ఉందా అని మహేశ్‌కుమార్ ప్రశ్నించారు. మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి జిల్లాకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ఉనికి కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించి అధికారంలోకి వస్తా మని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కాలానికి అనుగుణంగా వక్ఫ్‌బోర్డులో మార్పులు తెస్తే పర్వాలేదని, కానీ ఒక మతాన్ని హననం చేసేలా తక్కువచేసే సవరణలకు కాంగ్రెస్ అంగీకరించదన్నారు. వక్ఫ్‌బోర్డు బిల్లు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాను ఎక్కువగా దాని గురించి మాట్లాడనని స్ప ష్టం చేశారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు జావేద్ అక్రం, నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పథకాల అమలుతో ప్రజలు
సంతోషంగా ఉన్నారు
పేదల కళ్లలో సంతోషం కోసమే సన్నబియ్యం పంపిణీ
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తాం
రైతులపై లాఠీచార్జి చేసి బేడీలు వేసిన ఘనత బీఆర్‌ఎస్‌ది..
ఉనికి కోసమే వరంగల్ సభ
పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్