
చెరువులో పడి ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులోని గుండ్ల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన రమేష్(35) బతుకుతెరువు కోసం అంకాపూర్‌కు వచ్చి, పనిచేస్తున్నాడు. కాగ మంగళవారం బర్రెలను మేపుతుండగా చెరువులో పడిన బర్రెను కాపాడే ప్రయత్నంలో రమేష్ నీటిలోకి దిగాడు. చెరువులోని చేపల వల అతడికి తట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు..
వర్ని: మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆర్య రాకేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చెరువులో పడి ఒకరి మృతి