
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
నిజామాబాద్‌అర్బన్/డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఇంటర్ ఫలితాల్లో ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్తాచాటాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జ్యోతిర్మయి ఎంపీసీలో 1000 మార్కులకు 956 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974 మార్కులు, ఒకేషనల్‌లో పూజ 974 మార్కులు సాధించారన్నారు. అలాగే ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోఫియా కుల్సుం బైపీసీలో 967 మార్కులు, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థిని మనస్విని 932 మార్కులు సాధించారన్నారు. నాగరంలోని మైనారిటీ జూనియర్ బాలుర కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపులో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. బైపీసీలో 23 మందికి గానూ 19మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంపీసీలో సయ్యద్ అర్శలాన్ ఎంపీసీ సెకండియర్‌లో 986, బైపీసీలో భార్గవ్ 989 మార్కులు సాధించినట్లు తెలిపారు.
గురుకుల బాలికల ప్రతిభ..
డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల బాలికల ప్రతిభ కళాశాల (సీవోఈ) ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ మాధవీలత తెలిపారు. టి.లక్కీ ఎంపీసీ సెకండియర్‌లో 992మార్కులు, తోట కీర్తన బైపీసీలో 993 మార్కులు సాధించారన్నారు. అలాగే ఫస్టియర్‌లో అన్విత ఎంపీసీలో 464, శ్రీనిధి బైపీసీలో 433 మార్కులు సాధించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ నళిని తెలిపారు. సీహెచ్ సుస్మిత ఎంపీసీ సెకండియర్‌లో 950 మార్కులు, అమూల్య బైపీసీలో 978 మార్కులు సాధించారు. కావ్యకిశోరి ఎంపీసీ ఫస్టియర్‌లో 445, బైపీసీలో నవ్యశ్రీ 414 మార్కులు సాధించారు.
నారాయణకు ర్యాంకులు
నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ సెకండియర్ విద్యార్థినులు శ్రావణి 993, లవంగ వైష్ణవి 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో అయేషాఆఫీఫా 438, ఎంపీసీలో వరుణ్ 468 మార్కులు సాధించారు.
వెక్టర్ జూనియర్ కళాశాల ప్రతిభ
వెక్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో గౌరవ్‌శర్మ 466, మణిచంద్ర 466, బత్తుల వంశీ 466, ఆశ్రిత 466, మనస్విని 466 మార్కులు సాధించారు. ఎంపీపీ రెండో సంవత్సరంలో నిశాంత్‌రెడ్డి 991, బైపీసీ సెకండియర్‌లో శ్రీవర్షిని 989 మార్కులు సాధించారు.
‘అల్ఫోర్స్’కు ఉత్తమ మార్కులు
అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన ఎం.యోగేష్ ఎంపీసీ ఫస్టియర్‌లో 467 మార్కులు, ముత్యం హరిక 464 మార్కులు సాధించారు. శ్రీజన్ 466, సోనాలిక 467, అంజన్నప్రియ 467, ప్రవళిక 467 మార్కులు సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన
జిల్లా విద్యార్థులు
పలువురికి ఉత్తమ మార్కులు
ఎంతో గర్వంగా ఉంది...
కాకతీయ కళాశాలలో చదువుతూ ఎంపీసీ ఫస్టియర్‌లో 466 మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. కళాశాల డైరెక్టర్, అధ్యాపకులు ఎంతగానో సహకరించారు. తల్లిదండ్రుల ప్రోత్సహం మరువలేనిది. రెండో సంవత్సరంలో మరిన్ని మార్కులు సాధిస్తాను.
– ఎం.హర్షిత, కాకతీయ కళాశాల
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
కాకతీయ కళాశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. యజమాన్యం ఎప్పటికప్పుడు ప్రణాళిక బద్దంగా సూచనలు, సలహాలు అందించడం, సందేహాలను నివృత్తి చేశారు. ఇదే ప్రోత్సహంతో ఎంపీసీ సెకండియర్‌లో 991 మార్కులు సాధించగలిగాను. – త్రిషచౌదరి, కాకతీయ కళాశాల

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు