
అదిరేటి ‘హెయిర్’ స్టైల్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఫ్యాషన్‌కు కాదేదీ అనర్హం అనేది నానుడిగా మారిపోయింది. ఇక మహిళలే కాదు మగవాళ్లు, చిన్నారులు సైతం హెయిర్ స్టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హెయిర్ కేర్‌తోపాటు ట్రెండ్‌కు తగినట్లు ఫ్యాషన్‌గా కనిపించేందుకు నచ్చిన రీతిలో హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. బుధవారం నిజామాబాద్‌లో రైతు మహోత్సవ వేదిక వద్ద ఇద్దరు యువకులు, ఒక బాలుడు తమ హెయిర్ స్టైల్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఓ అగ్రికల్చర్ విద్యార్థి నెత్తి పైభాగంలో మొక్క మాదిరిగా పిలక వేసుకున్నాడు. మరో యువ అధికారి మహిళల జడ మాదిరిగా వెనుక పొడవైన జుట్టుతో కనిపించాడు. మరొక బాలుడు ఎడమవైపు పూర్తిగా జుట్టు లేకుండా మధ్యలో ఒత్తుగా ఉండేలా కటింగ్ చేయించుకున్నాడు.

అదిరేటి ‘హెయిర్’ స్టైల్

అదిరేటి ‘హెయిర్’ స్టైల్