
వరంగల్ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్ష
నిజామాబాద్‌అర్బన్: వరంగల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నిలబెడుతుందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న నిర్వహించే సభకు ఉ మ్మడి జిల్లా నుంచి 2,400 వాహనాలు, సుమారు 40 వేల మంది ప్రజలు తరలిరానున్నట్లు పేర్కొన్నా రు. నగరంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా వివిధ గ్రామాల నుంచి 250 ఆర్టీసీ బస్సు లు, 264 ప్రైవేట్ బస్సులు, 626 ట్యాక్సీలు, 1,266 కార్లలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వాహనాలను తెప్పిస్తున్నామన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌ను ఆశీర్వదించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమ లు చేయాలని, లక్షలాది మంది ప్రజల మధ్య నుంచి డిమాండ్ చేసేందుకు వరంగల్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం అడిగినందుకు భీమ్‌గల్‌లో 33 మందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమం జరిగితే, రేవంత్‌రెడ్డి పాలనలో విధ్వంసం జరిగిందన్నారు. అనంతరం రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరె డ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అవినీ తి రాజ్యమేలుతుందన్నారు. తెలంగాణలో దోచు కొని ఢిల్లీకి మూటలు పంపుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, సుజీత్ ఠాకూర్, మాజీ జెడ్పీటీసీలు జగన్, గడ్డం సుమన తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి