దుబాయ్‌లో పద్మశాలీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం | Word 1ST PADMASHALI FAMILY GETTOGETHER IN DUBAI | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో పద్మశాలీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం

Published Thu, Oct 20 2022 4:46 PM | Last Updated on Thu, Oct 20 2022 4:51 PM

Word 1ST PADMASHALI FAMILY GETTOGETHER IN DUBAI - Sakshi

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌లో నివసిస్తున్న పద్మశాలీ కుటుంబ సభ్యులు ఆత్మీయ కుటుంబ సమ్మేళనాన్ని ఘనం నిర్వహించుకున్నారు.  దుబాయ్‌లోని షెరటాన్‌ హోటల్లో అక్టోబర్‌ 16న జరిగిన ఈ వేడుకలో వందకు పైగా కుటుంబాలు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొంన్నాయి.    

కార్యక్రమానికి యూఏఈలోని ప్రమోద్‌ పిల్లమర్రి దంపతులు జ్యోతి  ప్రజ్వలన చేయగా,  మహిళా విభాగం మామ్‌ అండ్‌ మీ పేరుతో నిర్వహించిన వాక్‌ ఆకర్షణగా నిలిచింది.  పలు సాంస్కృతిక  కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన బాలలకు బహుమతులు అందించారు.  నేత ఈవెంట్స్‌ అండ్‌ నార్త్‌ అమెరికాన్‌ పద్మశాలీ అసోసియేషన్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

యూఏఈ  అండ్‌ నార్త్‌ అమెరికాన్‌ పద్మశాలీ అసోసియేషన్‌ చాప్టర్‌ నూతన డైరెక్టర్‌గా రవిచంద్ర గుత్తికొండ ఎంపికయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఈ తొలి సమ్మేళనానికి లక్ష్మీనారాయణ, మార్కండేయ్‌ కోడి, నరహరి గంగుల, డా. నారాయణ దేవనపల్లి,  ప్రజ్వల్‌ బంగారి,  శ్రీకాంత్‌ జక్క, శ్రీనివాస్‌  అడ్డగట్ట, శ్రీనివాస్‌ కొండా, సుధీర్‌ తుమ్మా, శ్రీ విజయ్‌ కుమార్‌ తదితర  అసోసియేషన్‌ సభ్యులు ఈ   ఈ వెంట్‌లో భాగస్వాములయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement