padmasali
-
చేనేతలకు గుర్తింపు జగనన్న చలవే
పద్మశాలీయులకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. గతంలో శాలీలుగా పిలిపించుకున్న తాము కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ పిలుపునుంచి ఉపశమనం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఉన్న తమ సామాజిక వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు, అందిస్తున్న ప్రోత్సాహంపై ఆమె సాక్షితో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కార్పొరేషన్‌తో అభివృద్ధికి అవకాశం చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయుల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమి లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 అక్టోబర్ 18న కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తనతోపాటు రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన 12 మందిని డైరెక్టర్లుగా నియమించారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, మంగళగిరి, విశాఖపట్నం, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, తణుకు, రాజమండ్రి, పెడన, ఉప్పాడ, పొందూరు, అరకు, పాడేరు, లంబసింగి, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, నగరి, పుత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కువగా మా సామాజికవర్గానికి చెందినవారున్నారు. పద్మశాలీయుల్లో సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, స్వకులశాలి, పట్టుశాలి వంటి ఉప కులాలున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే గుర్తింపు వచ్చింది. చట్టసభల్లోనూ అవకాశం 2014 టీడీపీ ప్రభుత్వంలో పద్మశాలీయులు చట్టసభలో లేరు. 2019 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు ఎంపీగా డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్సీగా మురుగుడ హనుమంతరావు ఉన్నారు. ఆప్కో చైర్మన్లుగా చల్లపల్లి మోహన్‌రావు, ప్రస్తుతం గంజి చిరంజీవి ఉన్నారు. రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, రాయదుర్గం, వెంకటగిరి, చీరాల మున్సిపల్ చైర్పర్సన్లుగా పద్మశాలీయులే ఉన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక, మంగళగిరికి మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. విదేశీ విద్యకు ప్రోత్సాహం నేను చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యాక అనేక మందిని విదేశీ విద్య పథకంపై అవగాహన కల్పించి పంపించా. హ్యాండ్లూం టె క్స్‌టైల్స్ కార్పొరేషన్ ద్వారా జాకార్డ్, లిఫ్టింగ్ మెషీన్‌తోపాటు మగ్గం పరికరాలను సబ్సిడీపై చా లా మందికి అందించా. – ప్రొద్దుటూరు సైకత మగువ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తీరప్రాంతంలో సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్ సిలికా దిబ్బలవద్ద సైకత శిల్పాన్ని రూపొందించారు. గ్రామానికి చెందిన యువతులతో కలిపి ఈ శిల్పాన్ని ప్రదర్శించారు. – చిల్లకూరు తిరుచానూరు అమ్మవారికి మా ఇంటి చీర సారె.. ఏటా తిరుచానూరులో జరిగే కార్తీక బ్రహ్మోత్సవాల్లో సింహవాహన సేవ రోజున పద్మశాలీయుల ఇంటి నుంచి చీర, సారె సమర్పించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అమ్మవారికి కుట్టు బార్డర్‌తో కలిగిన 9 ఇంచుల కంచిపట్టు చీరను సమర్పిస్తున్నాం. రాష్ట్రంలోని తమ సామాజికవర్గంవారందరికీ తిరుచానూరు నుంచి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున స్వామివారికి చీర, సారె ఇస్తున్నాం. చేనేతల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా మగ్గం నేసే ప్రతి కార్మికుడి కుటుంబానికి ఏటా రూ.24వేలు చెల్లిస్తున్నారు. ఈ పథకం వచ్చాక చాలా మంది తిరిగి వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పల్లెలుప్రగతిపట్టాలెక్కిపరుగులు పెడుతున్నాయి. గ్రామ సీమల స్వరూపం మారుతోంది. బాపూజీ కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో సుసాధ్యమైంది. పాలకొల్లు మండలంలోని వెలివెల గ్రామంలో రూ.8.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ గ్రామంలో 817 కుటుంబాల దరికి సంక్షేమ పథకాలు చేరాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ మీ పల్లెకు తీసుకురావడం సీఎం జగన్ సర్కారుకే చెల్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో చిన్నచిన్న పనులకు కూడా కిలోమీటర్ల దూరం వెళ్లాల్సివచ్చిందని, ఇప్పుడు పదడుగులు దూరంలోనే సమకూర్చడంతో సమయం కలిసివస్తోందని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. – పాలకొల్లు -
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి
కోరుట్ల: రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పద్మశాలీ ఆత్మగౌరవ సభలో వక్తలు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదివారం జరిగిన పద్మశాలీ ఆత్మగౌరవ యుద్ధభేరి సభకు ప్రముఖ కవి గుంటుక నరసయ్య పంతులు ప్రాంగణంగా నామకరణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 వేల మంది కులబాంధవులు తరలివచ్చారు. తొలుత ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ, పద్మశాలీలు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిదేదీ లేదని, చట్టసభల్లో ప్రాతినిధ్యం సాధించడంపై దృష్టి పెట్టాలని కోరారు. పిల్లలు ఉన్నత చదువులు చదివి సంఘం ఐక్యతకు కృషి చేయాలన్నారు. పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించేవరకూ పద్మశాలీలు విశ్రమించవద్దని కోరారు. అందరూ ఏకమై ‘మనఓటు మనకే’ నినాదంతో ముందుకు రావాలని కోరారు.కర్నూలు ఎంపీ సంజయ్ మాట్లాడుతూ, పద్మశాలీలు ఎక్కడున్నా జన్యుపరమైన సంబంధం కలుపుతుందన్నారు. ఏపీలో పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఎంపీగా పార్లమెంట్లో పద్మశాలీలకు చెందిన రెండు వీవర్స్ బిల్లులు ప్రవేశపెట్టడానికి కృషి చేశానని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పద్మశాలీ కులశక్తి విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏదైనా పద్మశాలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, రాజకీయ అస్థిత్వాన్ని సాధించే దిశ గా ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా పద్మశాలీ లు తరలిరావడం అభినందనీయమన్నారు. ఆత్మ గౌరవ యుద్ధభేరి సభ కమిటీ రాష్ట్ర చైర్మన్ బసవ లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, చట్టసభల్లో ప్రాతి నిధ్యం ఉంటేనే పద్మశాలీల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. బీసీల్లో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నా.. చట్టసభల్లో ఆశించిన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జగిత్యాల జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, పద్మశాలీ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జెల శ్రీనివాస్, జక్కుల ప్రసాద్ పాల్గొన్నారు. -
దుబాయ్‌లో పద్మశాలీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం
దుబాయ్: యునైటెడ్ అరబ్‌ఎమిరేట్స్‌లో నివసిస్తున్న పద్మశాలీ కుటుంబ సభ్యులు ఆత్మీయ కుటుంబ సమ్మేళనాన్ని ఘనం నిర్వహించుకున్నారు. దుబాయ్‌లోని షెరటాన్ హోటల్లో అక్టోబర్ 16న జరిగిన ఈ వేడుకలో వందకు పైగా కుటుంబాలు కుటుంబ సమేతంగా ఉత్సాహంగా పాల్గొంన్నాయి. కార్యక్రమానికి యూఏఈలోని ప్రమోద్ పిల్లమర్రి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా, మహిళా విభాగం మామ్ అండ్ మీ పేరుతో నిర్వహించిన వాక్ ఆకర్షణగా నిలిచింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన బాలలకు బహుమతులు అందించారు. నేత ఈవెంట్స్ అండ్ నార్త్ అమెరికాన్ పద్మశాలీ అసోసియేషన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. యూఏఈ అండ్ నార్త్ అమెరికాన్ పద్మశాలీ అసోసియేషన్ చాప్టర్ నూతన డైరెక్టర్‌గా రవిచంద్ర గుత్తికొండ ఎంపికయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఈ తొలి సమ్మేళనానికి లక్ష్మీనారాయణ, మార్కండేయ్ కోడి, నరహరి గంగుల, డా. నారాయణ దేవనపల్లి, ప్రజ్వల్ బంగారి, శ్రీకాంత్ జక్క, శ్రీనివాస్ అడ్డగట్ట, శ్రీనివాస్ కొండా, సుధీర్ తుమ్మా, శ్రీ విజయ్ కుమార్ తదితర అసోసియేషన్ సభ్యులు ఈ ఈ వెంట్లో భాగస్వాములయ్యారు. -
11న పద్మశాలి వివాహ పరిచయ వేదిక
చిట్టినగర్ : పద్మశాలి వ««దlూవరుల పరిచయ వేదికను 11వ తేదీ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎస్వీఎస్ కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నామని పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.