![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/5/5c%2Bk05_mr.jpg.webp?itok=ui9cas4n)
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సెంట్రల్ జోన్ అంతర జిల్లాల సీనియర్ పురుషుల మల్టీడే క్రికెట్ మ్యాచ్‌లలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జట్ల దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఏసీఏ(డీవీఆర్, సీపీ) మైదానాల్లో మంగళవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. డీవీఆర్ మైదానంలో కృష్ణా, ప్రకాశం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ప్రకాశం జట్టు పీల్డింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ ఆరంభించిన కృష్ణా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 61.4 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. కృష్ణా జట్టు ఓపెనర్ ఎ.సుశ్యామ్‌కీర్త్ 35 రన్స్ చేయగా, విశాల్ 120(నాటౌట్), చంటి 87(నాటౌట్) పరుగులతో దూకుడు ప్రదర్శించారు. ప్రకాశం జట్టు బౌలర్ వేణు రెండు వికెట్లు తీశాడు.
మరో మ్యాచ్‌లో..
సీపీ మైదానంలో గుంటూరు, పశ్చిమగోదారి జిల్లాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుంటూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. గుంటూరు జట్టు బ్యాట్స్‌మెన్‌లు మణిదీప్ 40, వంశీకృష్ణ 33 పరుగులు చేయగా, జానీబాషా 23(నాటౌట్), సిద్ధార్ధ 11(నాటౌట్) చేశారు. పశ్చిమగోదారి జిల్లా బౌలర్లు లోహిత్ మూడు, మునీష్‌వర్మ రెండు వికెట్లు తీశారు.
![120 పరుగులు చేసిన కృష్ణా బ్యాటర్ విశాల్ 1](/gallery_images/2023/07/5/04vig84a-310176_mr.jpg)
120 పరుగులు చేసిన కృష్ణా బ్యాటర్ విశాల్
Comments
Please login to add a commentAdd a comment