పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కై ంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment