వీరమ్మతల్లీ...పాహిమాం...
ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం భక్తజన కోలాహలంగా మారింది. శిడి బండి మహోత్సవం పూర్తవటంతో అమ్మవారిని దర్శించుకుని శిడి మొక్కులు తీర్చుకునేందుకు బుధవారం వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. మహిళలు పాలపొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. వీరమ్మతల్లీ...అమ్మా...పాహిమాం...అంటూ చల్లని తల్లికి పూజలు చేశారు. ఉయ్యూరు పాల వ్యాపారులు, వీరమ్మతల్లి ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అమ్మవారికి ఊరేగింపుగా వెళ్లి పొట్టేళ్లను కానుకగా సమర్పించారు. తొలుత శిడిబండికి పూజలు జరిపించారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జంపాన పూర్ణిమ, కేపీస్ డెంటల్ ఆసుపత్రి చైర్మన్ దాడి కై లాష్‌కుమార్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.
గ్రామ రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలి
కలెక్టర్ జి.లక్ష్మీశ
కేతనకొండ(ఇబ్రహీంపట్నం): గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే లెక్కలు పక్కాగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలంలోని కేతనకొండ గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. గ్రామానికి సంబంధించిన ఆన్‌లైన్ స్థితిగతులను పరిశీలించారు. గ్రామంలో 608 ఎకరాలకు గ్రౌండ్ లెవల్ ట్రూతింగ్ జరిగినట్లు సర్వేయర్‌లు వివరించారు. అందుకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రైతుకు సర్వే వివరాలు నోటీసు రూపంలో తెలియజేయాలని సూచించారు. రీసర్వే సమాచారం నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ వరప్రసాద్, సర్వేయర్లు పాల్గొన్నారు.
టీబీ ముక్త్ పంచాయతీల్లో చర్యలపై సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో టీబీ ముక్త్ పంచాయతీలుగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి ఎన్నికై న సందర్భంగా అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. నగరంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డాక్టర్ మాచర్ల సుహాసిని సమావేశంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డీఎల్‌టీఓ డాక్టర్ గుణశ్రీ, డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ విజయకృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, దినేష్, లీలాకుమార్ తదతరులు పాల్గొన్నారు.
టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్ ఇవ్వండి
వైద్య మంత్రిని కోరిన వైద్యుల సంఘం ప్రతినిధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ వర్తింపజేయాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కోరారు. ఆయన బుధవారం ప్రభుత్వాస్పత్రిని సందర్శించగా అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్, డాక్టర్ మహేష్, డాక్టర్ నూరుల్లా, డాక్టర్ సరళ తదితరులు కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. టీచింగ్ వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేయడంతో పాటు, పీఆర్‌సీ ఎరియర్స్‌ను విడుదల చేయించాలని కోరారు. వారి సమస్యలు విన్న మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వీరమ్మతల్లీ...పాహిమాం...
వీరమ్మతల్లీ...పాహిమాం...
వీరమ్మతల్లీ...పాహిమాం...
Comments
Please login to add a commentAdd a comment