కృష్ణా వర్సిటీ వీసీగా రాంజీ
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా కె. రాంజీని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాగా జేఎన్టీయూ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరావు ఆరు నెలలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ ఉపకులపతిగా కొనసాగిన విషయం విదితమే. త్వరలో రాంజీ కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సుబ్బారాయుడి సేవలో
రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బుద్ధు సతీష్‌శర్మ, విరూప్‌శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
కృష్ణా వర్సిటీ వీసీగా రాంజీ
Comments
Please login to add a commentAdd a comment