పెనమలూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నిమ్మించి వివాహితపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆర్‌ఎస్‌ఐపై బుధవారం కేసు నమోదైంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా మండవల్లి మండల భైరవపట్నంకు చెందిన మహిళ 2014లో అదే ప్రాంతానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
కాగా భార్యాభర్తలకు ఈ మధ్య కాలంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన ఏపీఎస్‌పీ 3వ బెటాలియన్‌లో ఆర్‌ఎస్‌ఐగా పని చేస్తున్న జి.భానుసతీష్ వినోద్‌కుమార్ భార్యకు పరిచయమయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమెను ఏడాది క్రితం పెనమలూరు మండలం పోరంకి తీసుకొచ్చి ఓ గదిలో ఉంచి లైంగికదాడి చేశాడు.
ఆ తరువాత కానూరులో కొద్ది రోజులు, యనమలకుదురులో కొద్ది రోజులు ఇంట్లో ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కాగా భానుసతీష్ గత నెల 30వ తేదీన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాఽధితురాలు మండవల్లి పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయటంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పెనమలూరు పోలీసులకు కేసు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment