విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
7
వైవీకి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్ వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పామర్రులో అడిగేవారేరి...!
పామర్రు నియోజకవర్గంలోని చాగంటిపాడు, భద్రిరాజుపాలెం, కళ్లావారిపాలెం ప్రాంతాలు ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఒక్కొక్క ప్రాంతనుంచి రోజుకు 400 ట్రాక్టర్లకుపైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ ర్యాంపు పేరుతో తెలుగుతమ్ముళ్లు ట్రాక్టరుకు రూ.200 వసూలు చేస్తున్నారు. అను మతి లేకున్నా నదిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.
కంచికచర్ల మండలం పెండ్యాల ఇసుక రీచ్‌లో యంత్రాలతో సాగుతున్న ఇసుక తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 15, కృష్ణాజిల్లాలో ఎనిమిది ఇసుక రీచ్‌లకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. యంత్రాలతో కాకుండా కూలీలతోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం గరిష్టంగా టన్నుకు రూ.120 ధర నిర్ణయించింది. అయితే కాంట్రాక్టర్లు ఇసుక రీచ్ తమ అధీనంలో ఉంటే చాలు అక్రమంగా ఇసుక రవాణాచేసి భారీఎత్తున దండుకోవచ్చన్న భావనతో ఎన్టీఆర్ జిల్లాలో టన్నుకు గరిష్టంగా రూ.80, కృష్ణాజిల్లాలో అతి తక్కువగా టన్నుకు కేవలం రూ.19కే కోట్ చేసి, ఇసుక లోడింగ్ చేసే టెండర్లను దక్కించుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెండ్యాల, కొక్కునూరు, అనుమంచిపల్లి, శనగపాడు రీచ్‌లో ఇసుక తవ్వకాలు ప్రారంభంకాగా, ఇక్కడ కూలీలతో ఇసుక లోడింగ్ చేయించడం లేదు. యంత్రాలను వినియోగిస్తూ, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. హైదారాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ఇసుకకు డిమాండ్ ఉండటంతో రీచ్‌లనుంచే నేరుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలించి భారీగా దండుకొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాలో నేరుగా ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ చేతులు దులుపుకొంటున్నారు.
బాబు మాటలకు అర్థాలే వేరులే..
ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామంటూ ముఖ్యమంతి చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలను కాంట్రాక్టర్లు పెడచెవిన పెడుతున్నారు. బాబు మాటలకు ఆర్థాలే వేరులే అని ప్రజాప్రతినిధులే బహిరంగంగా పేర్కొంటుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని పోలీసులు చెబుతున్నా ఆచరణలో మాత్రంలో అది అమలు కావడం లేదు. రీచ్‌లు, నిల్వ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు అలంకారప్రాయంగా మారగా, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అదికూడా మాటలకే పరిమితమైంది.ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించలేక పోతున్నారు. మున్నేరు, తిరువూరు ప్రాంతాల నుంచి ఇసుక నిత్యం తెలంగాణకు తరలివెళ్తూనే ఉంది.
చోడవరం క్వారీలో అక్రమ తవ్వకాలు...
చోడవరం ఇసుక క్వారీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 170 ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పుల ఇసుక బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంది. ఉచిత ఇసుక విధానం ఇక్కడ లేదు. అలాగే క్వారీకి టీడీపీ నేతలు మూడు ర్యాంప్‌లు ఏర్పాటు చేసి, ట్రాక్టర్‌కు ట్రిప్పుకు రూ.200 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ర్యాంపులపై రోజుకు రూ.2 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలపై నిషేదం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలు ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేయగా బాఽధితుల నుంచి ఫిర్యాదులు అందినా పోలీసులు దగ్గర ఉండి రాజీచేసి పంపారు. ఇక్కడ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున సొమ్ము అందుతుండటంతో మద్యం, గంజాయి బ్యాచ్‌కు క్వారీ అడ్డాగా మారింది.
పెద్దఎత్తున
ఇసుక అక్రమ రవాణా...
కృష్ణాజిల్లాలో ఎనిమిది రీచ్‌లలో తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, రీచ్‌లలో నీరు ఉండటంతో ఇప్పటివరకు శ్రీకాకుళం ఇసుక రీచ్ మాత్రమే ప్రారంభమైంది. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అక్కడ టీడీపీ నాయకులు ర్యాంపులు ఏర్పాటు చేసి, ట్రాక్టరు రూ.200 చొప్పున బహిరంగానే వసూలు చేస్తున్నారు. వందలాది ట్రాక్టర్ల ఇసుక అనధికారికంగా ర్యాంపుల నుంచి తరలిపోతున్నప్పటికీ కనీసం పోలీసులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోతుండటం గమనార్హం.
న్యూస్‌రీల్
సీసీ కెమెరాలు, డ్రోన్‌లు నామమాత్రమే యంత్రాలతో సాగుతున్న ఇసుక తవ్వకాలు .. కూలీలకు లభించని ఉపాధి అనుమతులు లేనిచోట కూడా తవ్వకాలు కొరవడిన అధికారుల పర్యవేక్షణ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment