ఘనంగా అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ఆధ్వర్యాన శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు జరిగాయి. కస్టమ్స్ ఆర్థిక భద్రత, గ్లోబల్ వాణిజ్య సులభతపై అవలంబించాల్సిన ముఖ్య పాత్రను సూచించింది. ఈ ఏడాది థీమ్ అయిన ‘కస్టమ్స్ – సమర్థత– భద్రత – శ్రేయస్సు’ ను అమలు చేయాలని పేర్కొన్నారు. కస్టమ్స్ కమిషనర్ సాదు నరసింహారెడ్డి నేతృత్వం వహించగా ముఖ్యఅతిథిగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ వరిందర్ మెహత, అతిథిగా డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ హాజరయ్యారు. సాదు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2024–25లో (జనవరి 2025 వరకు) విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటీస్) ద్వారా రూ.11,480 కోట్లు ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 36 మంది ఉద్యోగులు అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసినందుకు సత్కరించారు. కస్టమ్స్ అదనపు కమిషనర్ ప్రశాంత్ కుమార్ ప్రసంగించగా అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీమ్ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment