94418 20717
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కల్పిస్తున్న సదుపాయాల్లో లోటుపాట్లను ఆలయ అధికారులకు భక్తులు వాట్సాప్ నంబరు ద్వారా తెలియజేయొచ్చు. ఇందు కోసం దేవస్థానం 94418 20717 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం ప్రసాదాలు, అన్న ప్రసాదం అందజేస్తోంది. ఆయా సేవల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. సదుపాయాలపై సూచనలు, సలహాలతో పాటు ఆలయ సమాచారం సైతం ఈ వాట్సాప్ ద్వారా అందించొచ్చు. భక్తుల సూచనలు, ఫిర్యాదులపై ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని వెల్లడిస్తారు.
చిన్నాపురం పీహెచ్‌సీని సందర్శించిన డీఐఓ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్ సోమవారం బందరు మండలం చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సంద ర్శించారు. పీహెచ్‌సీలోని పలు విభాగాలను పరిశీలించారు. ల్యాబ్‌ను సందర్శించి వైద్య పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు జరుగుతున్నదీ లేనిదీ ఆరాతీశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు సక్రమంగా అందుతు న్నది లేనిది తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందించే విషయంలో జాగ్రత్తలు వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్‌సీ నిర్వహణ, సిబ్బంది పనితీరుపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ జి.లాస్య హరిత, ఎంపీహెచ్‌ఈఓ పి.వి.పరమేశ్వరరావు, వైద్య సిబ్బంది భారతి, రాంబాబు, హుస్సేన్‌బీ, సీతారాం, హేమ నాయక్, బాబా రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment