ఎల్లో వ్యాక్సిన్.. స్టాక్ నిల్
● అదరహో.. మిస్ బ్లాక్ షో
నల్లని దుస్తులు ధరించిన యువతులు ర్యాంప్ వాక్‌తో సందడి చేశారు. సందేశాత్మక రంగవల్లులతో ఆకట్టుకున్నారు. విజయవాడ స్టెల్లా కళాశాలలో గురువారం సాంస్కృతికోత్సవాలు– క్రిస్మస్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మిస్ బ్లాక్ షో అదరహో అనిపించింది. పోటీల్లో మిస్ ఆషా విజేతగా నిలిచింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ నిర్లక్ష్యం విదేశాలకు వెళ్లేవారికి శాపంలా మారింది. ఎల్లో ఫీవర్ ఉన్న దేశాలకు వెళ్లేవారు తప్పనిసరిగా ఎల్లో వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం రెండేళ్ల కిందట విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. తొలుత రాష్ట్రంలోని అందరికీ ఇక్కడ ఈ వ్యాక్సిన్ వేసేవారు. ఆ తర్వాత విశాఖపట్నం, తిరుపతిల్లో కూడా ఎల్లో వ్యాక్సిన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. కాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 40రోజులుగా ఎల్లో వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి రోజుకు నలుగురైదుగురు వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పాలకులు తీసుకున్న చర్యలు శూన్యం. ప్రభుత్వం కనీసం వ్యాక్సిన్లను కూడా సరఫరా చేయలేని దయనీయ స్థితికి చేరుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికవ్యయం..సమయం వృథా..
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఎల్లో వ్యాక్సిన్ లేకపోవడంతో విదేశాలు వెళ్లేవారు తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖపట్నం, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారికి అధిక వ్యయప్రయాసలు తప్పడం లేదు. విజయవాడ జీజీహెచ్‌లో రూ.500కే వ్యాక్సిన్ వేస్తుండగా, హైదరాబాద్ వెళితే రూ.6500 తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఛార్జీల ఖర్చుతోపాటు అధిక సమయం కూడా వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం..
ఎల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచే విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి బడ్జెట్ విడుదల చేయనందునే ఈపరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగైదు రోజుల్లో
అందుబాటులోకి..
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి నాలుగైదు రోజుల్లో ఎల్లో వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తాం. ఇటీవలే కొరత ఏర్పడింది. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి డబ్బులు కూడా చెల్లించాం. వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా సరఫరా చేసేందుకు చర్యలు తీసు కుంటున్నాం.
– డాక్టర్ మోహనకృష్ణ, జాయింట్ డైరెక్టర్
జీజీహెచ్‌లో 40 రోజులుగా అందుబాటులోలేని వైనం
విదేశాలకు వెళ్లేవారికి ఇది తప్పనిసరి
చేసేది లేక వైజాగ్, హైదరాబాద్ వెళ్తున్న ప్రజలు
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment