స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్‌ను పక్కాగా అమలు చేయాలి
ఏపీ చీఫ్ సెక్రెటరీ విజయానంద్
పాయకాపురం(విజయవాడరూరల్): ఇంటి వద్దనే వ్యర్థాల సెగ్రిగేషన్ జరగాలని ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అన్నారు. శనివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో 63వ డివిజన్ రాజీవ్ నగర్, ఆయుర్వేద హాస్పిటల్ వద్ద నిర్వహించిన, స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వాకథాన్‌ను ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు దోమ కాటు వల్ల, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఫాగింగ్, స్ప్రేయింగ్, డ్రోన్ స్ప్రేయింగ్, యాంటి లార్వా ఆక్టివిటీస్, చేసే స్టాల్ సందర్శించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను వీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాటిని రీసైకిల్ చేసే విధంగా అందరూ సహాయపడాలని, అందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలకు, మూడు రకాల బుట్టలను విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు అందించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్థాలు వేరుచేసి ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 120 మైక్రోన్స్ కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించిందని తెలిపారు. అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ సురేష్ బాబు, జాన్ డైరెక్టర్ డాక్టర్ లత, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, బయాలజిస్ట్ సూర్య నాయక్, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment