విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆప్‌కాస్ట్ మెంబర్ సెక్రటరీ శరత్‌కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ, ఆప్‌కాస్ట్, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యాన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి పోటీలను స్థానిక బిషప్ అజరయ్య స్కూల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. శరత్‌కుమార్ మాట్లాడుతూ సమాజంలో ప్రజల అవసరాలు, అభివృద్ధికి అండగా నిలిచే ఆవిష్కరణలను తీసుకురావాలని ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు డాక్టర్ సీవీ రామన్ వంటి శాస్త్రవేత్తలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్ అధికారి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment