నయవంచన | - | Sakshi
Sakshi News home page

నయవంచన

Published Sat, Mar 1 2025 7:39 AM | Last Updated on Sat, Mar 1 2025 7:37 AM

నయవంచ

నయవంచన

అరకొరగా తల్లికి వందనం

ఎన్నికల హామీల్లో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో దీనికి అరకొరగా కేటాయించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 3.35 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 2.42 మంది తల్లులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర బడ్జెట్‌ సామాన్యుడిని నయవంచనకు గురిచేసింది. శాసనసభలో శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. అంకెల గారడీ, అరకొర నిధులతో మసిపూసి మారేడు కాయ చేసినట్లు బడ్జెట్‌ ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సూపర్‌సిక్స్‌ హామీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. ప్రధానంగా రైతులు, యువత, మహిళల్లో అసహనం వ్యక్తమవుతోంది. నీటిపారుదల ప్రాజెక్టులకు అరకొరగానే నిధులు కేటాయించారు. అమరావతి నిర్మాణానికి అప్పు రూపంలో నిధులు తెచ్చారు తప్ప, బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు లేవని పెదవి విరుస్తున్నారు. మైట్రో రైలు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు వంటి వాటికి నామ మాత్రంగా కూడా నిధులు కేటాయించలేదన్న భావన వ్యక్తమవుతోంది. వైద్యరంగాన్ని సైతం విస్మరించారు.

బుడమేరు ఆధునికీకరణకు నిధులు సున్నా

గత ఏడాది సెప్టెంబరులో వచ్చిన బుడమేరు వరదలకు బెజవాడలో సగం భాగం నీట మునిగింది. సీఎం చంద్రబాబు విజయవాడ.. బుడమేరు వరద ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. బుడమేరును ఆధునికీకరమిస్తామని, ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. దానికనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ‘బుడమేరు’కు నిధులు కేటాయించకపోవడం గమనార్హం. బుడమేరు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీటిపారుదలకు నామమాత్రంగా నిధులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నీటి పారుదల రంగానికి బడ్జెట్‌లో నామ మాత్రంగా నిధులు కేటాయించారు. 2026 జూన్‌ నాటికి చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. మైలవరం, తిరువూరు, నూజివీడులో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటితోపాటు, తాగు నీరు అందించే అతి ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ పనులు పూర్తయ్యేందుకు రూ.4 వేల కోట్లకు పైగా నిధులు అవసరం. ప్రస్తుతం రూ.30 కోట్ల నిధులు కేటాయించి ఎలా ప్రాజెక్టును పూర్తి చేస్తారోనని నీటిపారుదల రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు.

కృష్ణా డెల్టాకు కేవలం రూ.400 కోట్ల నిధులను మాత్రమే కేటాయించారు. పులిచింతలకు రూ.16.37 కోట్లు ఇచ్చారు. పోర్టుకు అరకొరగానే నిధులు కేటాయించి, ప్రభుత్వం చిన్నచూపు చూసిందనే భావన వ్యక్తమవుతోంది. మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్‌కు నిధులు కేటాయించలేదు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు రూ.29.88 కోట్లను కేటాయించారు. విజయవాడ కార్పొరేషన్‌కు కేవలం రూ.115.11 కోట్లను మాత్రమే నిధులు విదిల్చారు.

నో ష్యూరిటీ

బాబు ఇచ్చిన పలు హామీలకు బడ్జెట్‌లో ష్యూరిటీ ఇవ్వలేదు. దీంతో సూపర్‌ సిక్స్‌ హామీలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

అన్నదాతకు అరకొరగా నిధులు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులకు ఏడాదికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని ప్రకటించారు. బడ్జెట్‌లో మాత్రం అరకొరగానే నిధులు కేటాయించడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 1,41,726 మంది రైతులు, కృష్ణా జిల్లాలో 2.70 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులున్నాయి.

నిరుద్యోగ భృతి నిల్‌

ఎన్నికల వేళ కూటమి తాము అధికారం చేపట్టగానే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని, లేదా నిరుద్యోగ భృతికింద నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో కేటాయింపులు ఇవ్వలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 6,09,032 కుటుంబాలు, కృష్ణా జిల్లాలో 8 లక్షల కుటుంబాలకు తీవ్ర నిరాశే మిగిల్చింది.

బడ్జెట్‌లో ఏ వర్గానికీ మేలు లేదు

ఉచిత బస్సు రాలేదు

ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చినా బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 9.70లక్షల మంది, కృష్ణా జిల్లాలో 9 లక్షల మంది మహిళలు ఉన్నారు.

వీరంతా ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బాబు ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లికి వందనం ఏదీ!

ఎన్నికల హామీల్లో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో దీనికి అరకొరగా కేటాయించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 3.35 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 2.42 మంది తల్లులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మహిళల నిట్టూర్పు

కూటమి అధికారంలోకి వస్తే 18–59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తా మని ఊదరగొట్టారు. బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39, 202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాట నమ్మి నిండా మునిగామని నిట్టూరుస్తున్నారు.

ప్రతి మహిళకు నెలకు రూ.1500...

కూటమి అధికారంలోకి వస్తే 18–59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని ఊదరగొట్టారు. బడ్జెట్‌లో దీని ఊసే లేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 8,30,958 మంది, కృష్ణా జిల్లాలో 7,39,202 మంది అర్హులైన మహిళలు ఉన్నారు. వీరంతా బాబు మాట నమ్మి నిండా మునిగామని నిట్టూరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నయవంచన1
1/1

నయవంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement