వచ్చే ఏడాదైనా భరోసా ఇస్తారా
అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రైతుకు రూ.20వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది ఖరీఫ్, రబీ సాగుకు పథకం అమలు చేయలేదు. ఈ బడ్జెట్ చూస్తే వచ్చే ఏడాది కూడా అమలయ్యేలా కనిపించడంలేదు. వరదలతో వరి పంట, రేటు లేక మిర్చి, టామాటా పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. మా ఇబ్బందులను తొలగించడానికి చర్యలు తీసుకోవాలి.
– చెరుకూరి శ్రీనివాసరావు, రైతు సంఘం
నాయకుడు, కవులూరు
పీఆర్సీ అమలుకు కేటాయింపులేవి
రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీ, ఐఆర్ అమలు కోసం నిధుల కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరం. 12వ పీఆర్సీ 20 నెలలు అలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం బాధాకరం. సీపీఎస్, జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వం బడ్జెట్‌లో ఎటువంటి ప్రకటన చేయకపోవడం సరికాదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. సిబ్బంది ఇబ్బందులను వెంటనే తెలుసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి.
–రాష్ట్రోపాధ్యాయ సంఘం
రాష్ట్ర కార్యదర్శి దేవరపల్లి విద్యాసాగర్
కాపులకు ప్రాధాన్యం దక్కలేదు
బడ్జెట్‌లో కాపులకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. కాపుల సంక్షేమానికి కేటాయింపులు ఏమీ కనిపించలేదు.. దీంతో కాపుల్లో నిరుత్సాహం కలిగింది. కాపులతో పాటు, బీసీలు, ఇతర వర్గాల సంక్షేమాన్ని సైతం విస్మరించారు.
– యర్రంశెట్టి అంజిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాకాపునాడు సంక్షేమ సంఘం
●
వచ్చే ఏడాదైనా భరోసా ఇస్తారా
వచ్చే ఏడాదైనా భరోసా ఇస్తారా
Comments
Please login to add a commentAdd a comment