మధురానగర్(విజయవాడసెంట్రల్): యూత పార్లమెంట్ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ వారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలను గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని, మేధాశక్తి ఉపయోగించి ప్రపంచంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉండటానికి కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి 18 నుంచి 25 ఏళ్లవారు యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనదలచిన వారు ముందుగా మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘వాట్ డజ్ వికసిత్ భారత్ మీన్ టూ యూ’ అంశం పై వీడియో చేసి మార్చి 9వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు అప్‌లోడ్ చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని తెలిపారు. తర్వాత ఈ ఐదు జిల్లాల నుంచి ఎంపికై న వారికి జిల్లా స్థాయిలో టీజేపీఎస్ కళాశాల, గుంటూరులో 150 విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్.. పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్’పై 3 నిముషాలు మాట్లాడాలని సూచించారు.
యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, యూత్ నాయకులు, నెహ్రూ యువ కేంద్రం అధికారులు, ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ఈ పోటీల గురించి యువతకు అవగాహన కలిగించి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment