భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామి వారి ఆలయం, సహస్ర కుంకుమార్చన ప్రాంగణంతో పాటు పాత మెట్ల వద్ద భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. రాహుకాల పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు గంట పాటు భక్తులు రాహుకాల పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు సర్వదర్శనంతో పాటు రూ.100 టికెట్ క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు మాఘమాసంలో రికార్డు స్థాయిలో కానుకలు, మొక్కుబడులను సమర్పించారు. భక్తులు హుండీల ద్వారా రూ.4.07 కోట్ల నగదును ఆది దంపతులకు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులను మంగళవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 26 రోజులకు గాను రూ.4,07,39,829 నగదుతో పాటు 700 గ్రాముల బంగారం, 6కిలోల 550 గ్రాముల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. ఇక ఈ హుండీ ద్వారా భక్తులు రూ.2,31,386 విరాళాలను దేవస్థానానికి సమర్పించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షించగా, డీఈవో రత్నరాజు దేవదాయ శాఖ సిబ్బది, దేవస్థాన సిబ్బంది, వన్‌టౌన్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
రేపటి నుంచి గుడారాల పండగ
అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారు లోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండుగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తును పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాయలసీమ, భీమవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో 15 ప్రత్యేక కోచ్‌లను గుడారాల పండుగ కోసం ఏర్పాటు చేయడం విశేషమని చెప్పారు. ఐదో తేదీ బుధవారం సాయంత్రం హోసన్నా దయా క్షేత్రంలో కొత్తగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు.
భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు
భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు
Comments
Please login to add a commentAdd a comment