హాకీ జిల్లా జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో మంగళవారం ఎంపిక పోటీలను నిర్వహించామని, ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశామన్నారు. రాఘవేంద్రరావు, వేణుగోపాల్, ఉపేంద్ర, శివప్రసాద్, ప్రశాంత్, వరప్రసాద్, సురేంద్ర, పౌల్‌రత్నం, సాయి, పవన్‌కుమార్, దుర్గామల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రభుకుమార్, సందీప్, కృపాసాగర్, ధావన్, మహ్మద్ బాషా, నరసింహ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment