పది విద్యార్థులకు వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 17న ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు హాజ రయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డీఈవో పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా 9552300009 నంబరుకు హాయ్ అనే సందేశాన్ని పంపితే సేవను ఎంచుకోండి అని వస్తుందన్నారు. దానిపై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ లేదా విద్యాసేవలు ఎంచుకోండని వస్తుందన్నారు.ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ అని నమోదు చేసి అప్లికేషన్ నంబరు, విద్యార్థి గుర్తింపు నంబరు, డేట్ ఆఫ్ బర్త్‌ను నమోదు చేసి స్ట్రీమ్‌ను సెలక్ట్ చేయాలన్నారు. అనంతరం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే హాల్‌టికెట్ మీ వాట్సాప్‌కు వస్తుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల హెచ్‌ఎంలు డౌన్‌లోడ్ అయిన హాల్‌టికెట్‌లో పేరు, పుట్టినతేదీ, మీడియం, ఫొటోగ్రాఫ్, సంతకం మొదలైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థుల వివరాల్లో ఏదైనా మార్పు ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుడు డైరెక్టర్ ఆఫ్ గవర్న మెంట్ ఎగ్జామ్స్‌కు మెయిల్ ద్వారా సమాచారం పంపాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment