ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో పేదలకు ఉపాధి అవకాశాలు
విజయవాడరూరల్: జాతీయ ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ కమిషనర్ జె.సునీత తెలియ జేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న, పాతపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను శిక్షణలో ఉన్న ఎంపీడీఓలతో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. ఉపాధి పథకం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి కోసం నీటికుంటలు తవ్వించడం, మామిడితోటల్లో పాదులు తవ్వడం, సరిహద్దు కందకాలు తవ్వకం పనులు జరుగుతున్నాయని ట్రైనీ ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు. అనంతరం నున్న గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని కల్పిస్తున్నామన్నారు. రెండు లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన వారు ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.రాము, ఇన్‌చార్జి ఎంపీడీఓ పి.మురళీకృష్ణప్రసాద్, 11 మంది ట్రైనీ ఎంపీడీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment