జీవితంలో క్రీడలు భాగం కావాలి
విజయవాడస్పోర్ట్స్: మానసిక సాంత్వన, శారీరక దృఢత్వం కోసం క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌జీజీవో రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోటీలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తోందని, రెండు శాతం ఉన్న క్రీడల కోటాను మూడు శాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి క్రీడల సాధనకు సమయాన్ని కేటాయించి, దైనందిన జీవితంలో ఎదురయ్యే వత్తిడిని జయించాలని సూచించారు. మహిళా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు. ఈ పోటీలను నిర్వహిస్తున్న ఏపీ ఎన్‌జీవో నాయకులను అభినందించారు. ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల నమ్మకం, విశ్వాసాన్ని కాపాడుతుందన్నారు. టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, లెమన్ అండ్ స్పూన్ తదితర పోటీల్లో మహిళా ఉద్యోగులు తలపడ్డారు. మరో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయని ఏపీ ఎన్‌జీజీవో మహిళా ఉద్యోగుల సంఘం చైర్‌పర్సన్ వి.నిర్మలకుమారి వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కమిటీ కన్వీనర్ ఎం.రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.జానకి, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు, క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులకు
క్రీడా పోటీల నిర్వహణ అభినందనీయం
మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏపీ ఎన్‌జీజీవో మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ మంగళవారం సందర్శించి, లెమన్ అండ్ స్పూన్ పోటీలను ప్రారంభించారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment