ఇంటర్ పరీక్షకు 920 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి మంగళవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 920 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 40,608 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 39,686 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి సత్యనారాయణరెడ్డి పరీక్షల తీరును పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
మధురానగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రసాదంపాడుకు చెందిన మంత్రవాది సూర్య తేజ తండ్రి మురళీధర్ (62)మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వస్తున్నారు. పడవల రేవు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదరుగా వస్తున్న మరొక ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. కిందపడిపోయిన మురళీధర్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మురళీధర్ మృతిచెందారు. దీంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment