మందుల విక్రయాల్లో అప్రమత్తం
విజయవాడస్పోర్ట్స్: రోగులకు మాత్రమే మెడిసిన్స్ విక్రయించాలని, నిబంధనలు అతిక్రమించి అనర్హులకు మందులు విక్రయించిన మెడికల్ షాపు యజమానులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్‌టాన్స్ చట్టం–1985, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం–1940 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హెచ్చరించారు. జిల్లాలోని మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రాష్ట్ర స్టాక్ హోల్డర్స్, అపోలో, మెడ్‌ప్లస్ మేనేజర్లతో జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ మంగళవారం సమావేశమయ్యారు. షెడ్యూల్ డ్రగ్స్ విక్రయం, వినియోగం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి, తప్పుడు ప్రిస్కిప్షన్‌తో మందులు విక్రయించడం అనేక నేరాలకు దారితీస్తోందని వివరించారు. ఎన్డీపీఎస్ చట్టంలో పొందుపర్చిన షెడ్యూల్ డ్రగ్స్ స్ట్రిప్స్‌పై ఎరుపు రంగు ఎన్‌ఆర్‌ఎక్స్ లేబుల్ ఉంటుందని, వీటి విక్రయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక బాధ్యతగా తీసుకుని మెడిసిన్స్ విక్రయించాలని, నకిలీ పత్రాలతో మెడిసిన్స్ కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను, డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు తీసుకునే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ యాంటీ నార్కోటిక్ ఇన్‌చార్జ్ ఏసీపీ ఎస్.కిరణ్‌కుమార్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ డైరక్టర్ అనిల్‌కుమార్, నార్కోటిక్ సెల్ ఇనస్పెక్టర్ రవికుమార్, ఈగల్ టీం ఎస్‌ఐ వీరాంజనేయులు, మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయి పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
Comments
Please login to add a commentAdd a comment