
వీఆర్ సిద్ధార్థలో ప్రయోగశాలకు రూ.20 లక్షల విరాళం
పెనమలూరు: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్(ఈసీఈ) విభాగంలో పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు దాత రూ.20 లక్షల విరాళం అందజేశారు. కాలేజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో 1983 బ్యాచ్ పూర్వ విద్యార్థి పొట్లూరి భాస్కరమూర్తి తన తండ్రి పీజే మూర్తి పేరున యాంటీనా ఆర్‌ఎఫ్ ఇంజినీరింగ్ లేబొరేటరీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ చాన్సలర్ కేవీ చౌదరికి అందజేశారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ పరిశోధనలు, అభివృద్ధి సామర్థ్యం బలోపేతం చేయడానికి ప్రయోగశాల ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దాతలు ముందుకు వచ్చి సాయం అందిస్తే మరిన్ని ప్రయోగశాలలు విద్యార్థులకు సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డి.వెంకట్రావు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment