విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Fri, Mar 21 2025 2:07 AM | Last Updated on Fri, Mar 21 2025 2:02 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025

ఇఫ్తార్‌ సహరి

(శుక్ర ) (శని)

విజయవాడ 6.23 4.53

మచిలీపట్నం 6.22 4.51

బందరు చేరిన సైకిల్‌ ర్యాలీ

దేశంలో అత్యున్నత భద్రతను అందించే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ గురువారం మచిలీపట్నం చేరుకుంది.

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన సుంకర బాలాంబ కుటుంబం రూ. 2,00,116 విరాళాన్ని అందజేసింది.

8లోu

ఈవీఎం గోడౌన్‌కు

పటిష్ట భద్రత

భవానీపురం(విజయవాడపఽశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్స్‌ ఉన్న గోడౌన్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోగల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎం, వీవీప్యాట్‌లు భద్రపరిచన గోడౌన్‌ను అధికారులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల గోడౌన్‌ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ చంద్రమౌళి, వై. రామయ్య (టీడీపీ), ఎం. వినోద్‌ కుమార్‌ (బీఎస్‌పీ), తరుణ్‌ కాకాని (బీజేపీ), వై ఏసుదాసు (ఐఎన్‌సీ) పాల్గొన్నారు.

విజయవాడ డివిజన్‌కు

ప్రతిష్టాత్మక అవార్డు

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రోజువారీ విధుల్లో అధికార భాషను అమలు పరచడంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన ‘రఘువీర్‌ చాల్‌ వైజయంతి’ షీల్డ్‌ను విజయవాడ డివిజన్‌ సాధించింది. గురువారం న్యూఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన అధికార భాష అమలు కమిటీ సమావేశంలో డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌, డివిజన్‌ రాజభాష అధికారి ఎం.కె.నాగరాజుతో కలసి రైల్వేబోర్డు చైర్మన్‌ సతిష్‌కుమార్‌ చేతుల మీదుగా షీల్డ్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ రాజభాష అమలులో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు రావటం డివిజన్‌కే గర్వకారణమన్నారు. డివిజన్‌ సాధించిన విజయంతో పాటుగా గుంటుపల్లిలోని రాయపాడు వ్యాగన్‌ వర్కుషాపునకు రాజభాష అమలులో ‘ఆదర్శ కార్ఖానా’గా గుర్తింపు వచ్చినట్లు తెలిపారు.

31వరకే ధాన్యం

కొనుగోలు కేంద్రాలు

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 2024–25 ధాన్యం సేకరణ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తారని జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ గురువారం తెలిపారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని ఇంకా విక్రయించాల్సిన వారు ఉంటే సంబంధిత కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 70,718 రైతుల నుంచి రూ. 1,333.43 కోట్ల విలువ కలిగిన 5,83,117 టన్నులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు.

వర్సిటీల్లో సమస్యలను

పరిష్కరించాలని వినతి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ మధు మూర్తిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి వినతిప్రతం అందజేశామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే మంజూరు చేసే లా ప్రభుత్వంతో చర్చలు జరిపి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని, వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్‌ విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ హామీ ఇచ్చిన విధంగా జీఓ 77ను రద్దుచేసి పీజీ విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు. ఏబీవీపీ జాతీయ సమితి సభ్యుడు యాచంద్ర, పరిషత్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్‌కుమార్‌ రెడ్డి, సురేంద్ర, పరిషత్‌ సభ్యులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత ఏడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మునేరు ఊహించని విధంగా ఉప్పొంగి.. రైతులను దారుణంగా ముంచేసింది. దాదాపు 3.50 లక్షల కూసెక్కుల మేర వరద ప్రవాహం రావడంతో భారీగా ఇసుక మేటలు వేసింది. భూములు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. మునేరు పరిధిలోని కాలువలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాక 212 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులకూ గండ్లు పడి ధ్వంసం అయ్యా యి. ఇందులో ప్రధానంగా మునేరు పక్కన ఉన్న తువ్వకాలువకు 40 చోట్ల వరకు గండ్లు పడి నాశనమైంది. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేములనర్వ వద్ద నాలుగు, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద ఒక పెద్ద గండి పడింది. వీటికి శాశ్వత ప్రాతిపదికన గండ్లు పూడ్చలేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు.

అన్నదాతల ఆందోళన..

తెలంగాణ నుంచి వచ్చే మునేరు 240 కిలోమీటర్ల మేర ప్రవహించి ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. వత్సవాయి మండలం పోలంపల్లి నుంచి ప్రారంభమయ్యే మునేరు ప్రాజెక్టు పరిధిలో మెయిన్‌కాలువ ఉంది. ఇది వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరం.. పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, నందిగామ మండలం సోమవరం వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 22,000 ఎకరాలకు పైగా సాగు ఉంది. దీనికి పడిన గండ్లు తాత్కాలికంగా పూడ్చారు తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయలేదు. ఇక తువ్వ కాలువ వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వరకూ ప్రవహిస్తుంది. తువ్వకాలువ(పెనుగంచిప్రో లు) బ్రాంచ్‌ కింద సుమారు 3 వేల ఎకరాల వరకు సాగవుతోంది. కాలువకు వేమవరం, ఆళ్లూరుపాడు వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఆయా చోట్ల తాత్కాలికంగా పూడ్చారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయ లేదు. దీంతో మళ్లీ వరద వస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది.

రెండు సీజన్లు కోల్పోయిన రైతులు..

గండ్లు పడటంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు విలువైన పంట కోల్పోయారు. అంతేకాక పొలాల్లో ఇసుక మేట వేయటం, భూములు కోతకు గురి కావటం, మోటార్లు, బోర్లు పాడవడంతో రైతులు దారుణంగా నష్టపోయారు. అయితే వరదలు పోయి ఆరు నెలలు అవుతున్నా గండ్లు పూడ్చటంపై అధికారులు దృష్టి పెట్టటం లేదు. దీంతో ఖరీఫ్‌తో పాటు రబీ సాగు కూడా రైతులు కోల్పోయారు. కొద్ది మంది రైతులు మాత్రం పొలాలను సొంత డబ్బు ఖర్చు పెట్టి రబీ సాగు చేశారు. నేటికీ చాలా పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి.

అరకొరగా నష్టపరిహారం..

● వరదలకు వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరంలో సుమారు 200 ఎకరాల్లో పంట పాడవగా 100 ఎకరాల్లో ఇసుక మేట వేసింది.

● పెనుగంచిప్రోలు మండలంలో 3097 ఎకరాల్లో వరి పంట నాశనమైంది. అందులో 300 ఎకరాల్లో ఇసుక మేట వేసింది.

● ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు మాత్రం నామమాత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇసుక మేటకు, కోతకు గురైన భూములకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్‌లో పనులు చేయకపోతే, వర్షాకాలంలో మునేరుకు వరద వస్తే కడగండ్లు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

● ప్రభుత్వం మాత్రం గండ్లు పూడ్చటానికి కేవలం ప్రతిపాదనలు సిద్ధం చేసిన, నిధులు మంజూరు చేయలేదు. దీంతో గండ్లు పూడ్చడంపై సందిగ్ధత నెలకొంది.

మునేరు మెయిన్‌ కాలువకు పడిన గండి(ఫైల్‌)

● మునేరుకు వచ్చిన భారీ వర్షాలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.7కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.43.02 కోట్లు, మొత్తం రూ.50.02 కోట్లు అవుతాయని అంచనా వేశారు.

● మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులకు సంబంధించి 212 చోట్ల గండ్లు పడగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.656కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.38.62 కోట్లు, మొత్తం రూ.53.276కోట్లు అవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు.

● మునేరు, చెరువులకు కలిపి మొత్తం 282 గండ్లకు రూ.103.296కోట్లు నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు.

● అయితే అక్కడక్కడ తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. శాశ్వత పనులకు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి.

చర్లపల్లి–కన్యాకుమారి మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు

లక్ష్మీపురం

(గుంటూరు వెస్ట్‌): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్‌ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఏప్రిల్‌ 2 నుంచి జూన్‌ 25 వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్‌ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్‌ 4 నుంచి జూన్‌ 27 ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్‌ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.

నాగాయలంక: ఆలీవ్‌ రిడ్లే తాబేళ్ల ప్రాణహాని కలిగించే చర్యలకు పాల్పడవద్దని పాలకాయతిప్ప కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గురువారం తీరగ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. మండలంలోని ఎదురుమొండి, గుల్లలమోద, ఏటిమొగ, దీనదయాళపురం గ్రామాల్లో వివిధ అంశాలపై విస్త్రృత ప్రచారం, హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల వేటలో మత్స్యకారులు వాటికి ప్రాణహాని కలిగించే నిషేధిత వలలు(టేకు వల, మూడు పొరల వల వంటివి) ఉపయోగించకూడదని చెప్పారు. అలాగే వేట సమయంలో వలల్లో చిక్కిన తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో వదిలిపెట్టాలని సూచించారు. మైరెన్‌ పోలీస్‌ సిబ్బంది, ఆయా గ్రామాల పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు.

నాగాయలంక మండలం ఏటిమొగ వద్ద స్థానికులకు అవగాహన కల్పిస్తున్న మైరెన్‌ పోలీసులు

7

న్యూస్‌రీల్‌

గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు 70 చోట్ల గండ్లు 212 మైనర్‌ చెరువులకు నష్టం 25వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రశ్నార్థకం పలు ప్రాంతాల్లో మేటలు వేసిన ఇసుక, కోతకు గురైన భూమి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం

ప్రతిపాదనలు ఇలా..

మార్క్స్‌ టేబులేషన్‌ ప్రక్రియ..

స్పాట్‌ వాల్యూయేషన్‌లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్‌ టేబులేషన్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్‌ ఎగ్జామినార్‌ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్‌ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్‌ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్‌ వాల్యూయేషన్‌లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్‌ టేబులేషన్‌ను (స్కానింగ్‌ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది.

గ్రామాల్లో పాలకాయతిప్ప

కోస్టల్‌ సెక్యూరిటీ సిబ్బంది అవగాహన

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ9
9/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ10
10/11

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ11
11/11

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement