26న వైఎస్సార్ సీపీ ఇఫ్తార్ విందు
పటమట(విజయవాడతూర్పు): రంజాన్ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, ముస్లింలకు జగన్ మాత్రమే అండగా నిలబడ్డారని, పదవులు ఇవ్వటం నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
ముస్లిం పక్షపాతి వైఎస్ జగన్..
ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ముస్లింలకు జగన్ చేసిన మేలు మర్చిపోలేనిదన్నారు. ముస్లింల పక్షపాతిగా వైఎస్సార్ సీపీ ఎంతో న్యాయం చేసిందని, జగన్ సారధ్యంలోనే ముస్లింలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని కొనియాడారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆసిఫ్ మాట్లాడుతూ ముస్లిం ఉన్నత స్థానాలలో స్థిర పడే విధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి జగన్ కూడా తన వంతు సహాయం చేశారని, తండ్రి బాటలో హజ్ యాత్రకు వెళ్లేవారికి అన్ని సౌకర్యాలు, రాయితీలు కల్పించారని పేర్కొన్నారు.
ద్రోహులు కూటమి నేతలు..
పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మొండి తోక జగన్ మోహనరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలందరికీ మంచి జరిగిందని, కుటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు. పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ముస్లింల ద్రోహులని, ముస్లింలకు మంచి జరగటం వారికి ఇష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మునీర్ అహ్మద్ షేక్‌లతోపాటు పలువురు కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లాస్థాయి పార్టీ నేతలు పాల్గొన్నారు
హాజరుకానున్న మాజీ సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ
మండపంలో ఏర్పాట్లు
వివరాలు వెల్లడించిన పార్టీ ఎన్టీఆర్
జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
Comments
Please login to add a commentAdd a comment