గంగమ్మ ఒడికి ఆలివ్ రిడ్లే
● సముద్రబాట పట్టిన తాబేళ్ల పిల్లలు
కోడూరు: బుల్లి బుల్లి తాబేళ్ల పిల్లలు బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రుడి ఒడిలోకి చేరాయి. హంసలదీవి సాగరతీరంలోని పాలకాయతిప్ప సంతానోత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన 300 తాబేళ్ల పిల్లలను మైరెన్ ఎస్‌ఐ పూర్ణమాధురి సిబ్బందితో కలిసి ఆదివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్రం కలుష్యాన్ని తగ్గించే అరుదైన ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్ల పిల్లలను కేంద్రంలో నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర పెంచుతారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వేల తాబేళ్ల గుడ్లను సేకరించినట్లు అటవీ రేంజర్ శ్రీసాయి తెలిపారు. మే నెలాఖరు లోపు సుమారు ఐదు వేల పిల్లలను సముద్ర బాట పట్టించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు.
బగళాముఖి సేవలోహైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు.
గంగమ్మ ఒడికి ఆలివ్ రిడ్లే
Comments
Please login to add a commentAdd a comment