
ఈ–డైరెక్టరీ ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీని ఆదివారం ఐఎంఏ హాల్లో డాక్టర్ భవానీశంకర్ (యూఎస్‌ఏ) ఆవిష్కరించారు. విజయవాడ సొసైటీ ఆఫ్ ఎనస్తీషియాలజిస్టు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ)లో భాగంగా ఆయన క్యాఫ్నోగ్రఫీ, అబ్‌స్టెట్రిక్ ఎనస్తీషియాను వివరించారు. ఈ సందర్భంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. సంఘ రాష్ట్ర అకడమిక్ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి తారకప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్తీయాలజిస్ట్స్ విజయవాడ సిటీ బ్రాంచ్ ఈ– డైరెక్టరీ ఆవిష్కరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ–డైరెక్టరీలో విజయవాడకు చెందిన 150 మంది ఎనస్తీషియా వైద్యుల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. డైరెక్టరీని తయారు చేసిన డాక్టర్ దివ్యరావెళ్ల, డాక్టర్ కీర్తి చిగురుపాటిని అభినందించారు. అనంతరం డాక్టర్ కె.భవానీశంకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఐఎస్‌ఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్, డాక్టర్ కిరణ్, డాక్టర్ ఫణి, డాక్టర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.