
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● విజయవాడ నగరం మధ్యలో ఉన్న పెజ్జోనిపేటను ఆనుకొని ఏలూరు కాలువ ప్రవహిస్తోంది. రెండు మూడు నెలలు తప్ప ఏడాది పొడవునా కాలువ ప్రవహిస్తుంది. ఇటీవల ఏలూరు కాల్వకు ఆనుకొని బోర్ వేశారు. 300 అడుగులు వేసినా నీళ్లు పడలేదు.
● ఏలూరు లాకుల సెంటర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఇక్కడ బోరు వేసేందుకు 300 అడుగుల వరకు తవ్వారు. కానీ నీళ్లు పడలేదు.
● గొల్లపూడి వద్ద కృష్ణా నది పక్కనే ఉన్న ఎస్‌ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించేందుకు బోరు తవ్వారు. కానీ ఇక్కడ కూడా నీరు పడలేదు.
● గొల్లపూడిలోనే హోల్‌సేల్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రెండు బోర్లు ఎండిపోయాయి. వాటి స్థానంలోనే రెండు బోర్లు వేశారు. ఒక్కొక్కటీ 300 అడుగుల వరకు వేశారు. కానీ ఆశించిన స్థాయిలో నీరు పడలేదు.
ఇదీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి. నీటి కోసం బోర్లు వేసి, రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది.
గొల్లపూడిలో
ఎండిపోయిన బోరు
న్యూస్‌రీల్

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025