ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం
రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో ఎల్.శ్రీరాములుకు చెందిన ఖాళీ కోళ్ల ఫారం సోమవారం దగ్ధమైంది. మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రణస్థలం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రణస్థలం అగ్నిమాపకాధికారి పైల అశోక్ తెలిపారు.
కాశీబుగ్గలో ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడు రోడ్లు కూడలి వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న పూజా సామగ్రి షాపు తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో జేసీబీతో షాపును తొలగిస్తుండగా దుకాణదారుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి దుకాణదారులను అదుపుచేశారు. ఈ క్రమంలో షాపు యజమాని కఠారి శ్యామ్ ఒంటిపై నూనె పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని శ్యామ్‌ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులను కూడా పోలీసు స్టేషన్‌కు తరలించారు.
వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆమదాలవలస రూరల్: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్‌కుమార్ అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంభ సభ్యులు చెబుతున్నారు. చిట్టీ డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ చిట్టీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్.బాలరాజు తెలిపారు.
ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment